సుప్రీంకోర్టు బెంచ్‌లో కూర్చున్న విదేశీ వ్యక్తి.. స్వయంగా సీజేఐ ఎందుకు కూర్చోబెట్టారు?
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే ఓ విదేశీయుడిని సుప్రీకోర్టు బెంచ్‌లో కూర్చో బెట్టారు. అవునా? అని ఆశ్చర్యపోకండి.. అసలు విషయం ఏంటంటే..
ఇండియాలో మున్సిఫ్ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు వరకు కోర్టు ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతాయో 90 శాతం మంది భారతీయులకు పూర్తిగా తెలియదు. సినిమాల్లో చూపింపినట్లే వాదనలు ఉంటాయని, లాయర్ల రూపంలో ఎవరైనా మాట్లాడవచ్చని, జడ్జీల స్థానంలో ఎవరు బడితే వాళ్లు కూర్చోవచ్చనే ఆలోచనతో ఉంటారు. కానీ.. వాస్తవానికి ఇండియాలోని చిన్న కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అలాంటివి అసలు జరగనే జరగవు. కానీ ఈ రోజు మాత్రం ఏకంగా మన దేశ అత్యున్నత న్యాయస్థానంలో అరుదైన సన్నివేశం చోటు చేసుకున్నది. ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ పక్కనే ఓ విదేశీయుడిని సుప్రీకోర్టు బెంచ్‌లో కూర్చో బెట్టారు. అవునా? అని ఆశ్చర్యపోకండి.. అసలు విషయం ఏంటంటే..
భారత్ గణతంత్ర దేశంగా అవతరించి మొన్న జనవరి 26కి 73 ఏళ్లు అయ్యింది. మనకు గణతంత్రం వచ్చిన రెండో రోజున అంటే 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ఉనికిలోకి వచ్చింది. దాన్నే మన దేశ అత్యున్నత న్యాయస్థానం వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సారి మన సుప్రీంకోర్టు వ్యవస్థాపక దినోత్సవానికి సింగపూర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సుందరేశ్ మేనన్‌ను ముఖ్య అతిథిగా పిలిచారు. శనివారం సుప్రీంకోర్టుకు సంబంధించిన కార్యక్రమంలో భాగంగా 'మారుతున్న ప్రపంచంలో న్యాయ వ్యవస్థ పాత్ర' అనే అంశంపై ఆయన ప్రసంగించాల్సి ఉన్నది.
సింగపూర్ చీఫ్ జస్టిస్ ముందుగానే ఇండియాకు వచ్చారు. దీంతో సీజే సుందరేశన్‌ను మన సీజేఐ డీవై చంద్రచూడ్ ఈ రోజు తన బెంచ్‌లో కూర్చోబెట్టారు. కాసేపు బెంచ్‌లో కూర్చున్న సుందరేశన్ సుప్రీంకోర్టులో జరిగే ప్రొసీడింగ్స్‌ను పరిశీలించారు. భారత సంతతికి చెందిన సింగపూర్ చీఫ్ జస్టిస్ సుందరేశన్ మీనన్ తనకు ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాగా, రేపు జరుగనున్న కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు మీడియా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. దేశంలోని యువత న్యాయవ్యవస్థ గురించి మరింత తెలుసుకోవల్సిన అవసరం ఉన్నది. కాబట్టే ఈ ప్రోగ్రామ్‌ను లైవ్ టెలికాస్ట్ చేయాలని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలియజేసింది.