కర్నాటక సీఎం సిద్ధరామయ్యే.. - డిప్యూటీ సీఎంగా డీకే.. అధికారికంగా వెల్లడించిన కాంగ్రెస్ పార్టీ
ఇక ముఖ్యమంత్రి పదవి కోసం చివరి వరకు పోరాడిన డీకే శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయించింది. దీంతో పాటు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగానూ డీకే కొనసాగనున్నారు.
కర్నాటక సీఎం ఎంపిక విషయంలో సుదీర్ఘ కసరత్తు ముగిసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఖరారు చేస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ గురువారం మధ్యాహ్నం అధికారికంగా ప్రకటించింది.
ఇక ముఖ్యమంత్రి పదవి కోసం చివరి వరకు పోరాడిన డీకే శివకుమార్‌కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయించింది. దీంతో పాటు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగానూ డీకే కొనసాగనున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పార్టీలో ఏకాభిప్రాయం కుదిరింది. అనంతరం గురువారం మధ్యాహ్నం పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జి రణీప్ సుర్జేవాలా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. సీఎం పేరును ప్రకటించారు.
డీకే శివకుమార్ పీసీసీ చీఫ్‌గా వచ్చే పార్లమెంటు ఎన్నికల వరకు కొనసాగుతారని వారు వెల్లడించారు. అలాగే డిప్యూటీ సీఎంగా ఆయన ఒక్కరే ఉంటారని స్పష్టం చేశారు. శనివారం నాడు మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని వారు వెల్లడించారు.