ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉన్నదా?

నవంబర్‌ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండటం లేదన్న కాంగ్రెస్‌ ఎంపీ

Advertisement
Update:2024-11-19 09:52 IST

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతున్నది. దీనికితోడు పొగమంచు కమ్ముకోవడంతో గాలి నాణ్యతా సూచీ అత్యంత తీవ్రస్థాయికి పడిపోయింది. దీనిపై తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ స్పందిస్తూ.. కేంద్రంపై విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉన్నదా? అని ప్రశ్నించారు.

కాలుష్య నగరాల జాబితా గణాంకాలకు సంబంధించి ఓ టేబుల్‌ను థరూర్‌ పోస్ట్‌ చేశారు. 'ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది. ఇక్కడ ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి. రెండో అత్యంత కాలుష్య నగరంగా ఢాకా (బంగ్లాదేశ్‌ రాజధాని)తో పోలీస్తే ఢిల్లీలో ప్రమాదస్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉన్నది. ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నాను. కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవడం లేదు. నవంబర్‌ నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండటం లేదు. మిగతా సమయాల్లో అంతంత మాత్రంగానే జీవనం సాగించగలం. ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా? అని రాసుకొచ్చారు. 

Tags:    
Advertisement

Similar News