శిరోమణి అకాళీదల్‌ అధ్యక్ష పదవికి బాదల్‌ రాజీనామా

కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసమే పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడి

Advertisement
Update:2024-11-16 15:49 IST

కొంతకాలం క్రితం వరకు పంజాబ్‌ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సుక్బీర్‌ సింగ్‌ బాదల్‌ శిరోమణి అకాళీదల్‌ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసమే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టుగా వెల్లడించారు. ఇన్నాళ్లు తనకు సహకరించిన పార్టీ నాయకులు, శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా పంజాబ్‌ రాజకీయాల్లో శిరోమణి అకాళీదల్‌ క్రియాశీల పాత్ర పోషిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కోసమే ఎన్‌డీఏ నుంచి వైదొలిగి సొంతగా పోటీ చేసింది. అయినా ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదు. ఆమ్‌ ఆద్మీ పార్టీ రంగ ప్రవేశంతో అకాళీదల్‌ చావు దెబ్బతింది. వరుసగా రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుండటంతో సుక్బీర్‌సింగ్‌ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన ఫరీద్‌ కోట్‌ నుంచి రెండుసార్లు, ఫిరోజ్‌పూర్‌ నుంచి ఒక సారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009 నుంచి 2017 పంజాబ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.

Tags:    
Advertisement

Similar News