ఢిల్లీలో తీవ్రంగా క్షీణించిన గాలి నాణ్యత

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 400 మార్క్‌ను దాటి 'అతి తీవ్రమైన కేటగిరి'లోకి చేరింది

Advertisement
Update:2024-11-13 12:01 IST

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యపు పొగ కమ్మేసింది. గాలి నాణ్యత సూచీ 400 దాటడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఢిల్లీతో పాటు నోయిడా, గాజియాబాద్‌, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌లో తీవ్రమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 400 మార్క్‌ను దాటి 'అతి తీవ్రమైన కేటగిరి'లోకి చేరింది. నోయిడా, గురుగ్రామ్‌, గాజియాబాద్‌లలో గాలి నాణ్యత 188గా ఉన్నది. గాలి నాణ్యత సూచీ 400 దాటడంతో 'తీవ్రమైన' క్షీణతగా అధికారులు ప్రకటించారు. 

Tags:    
Advertisement

Similar News