రోడ్డు పక్కన ఏకంగా 52 కిలోల బంగారం రూ.10 కోట్ల నగదు
మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలో రోడ్డు పక్కన ఏకంగా 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల నగదు దొరకడం సంచలనంగా మారింది.
మధ్యప్రదేశ్ లోని భోపాల్ నగరంలో రోడ్డు పక్కన ఏకంగా 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల నగదు దొరకడం సంచలనంగా మారింది. అడవిలో పార్క్ చేసి ఉండటంతో పోలీసులు సీజ్ చేశారు. అందులో అంత బంగారం, డబ్బు చూసి వారి మైండ్ బ్లాంక్ అయింది.ఆ ఇన్నోవా కారును గ్వాలియర్ కు చెందిన చేతన్ గౌర్, సౌరభ్ శర్మ అనే వ్యక్తులకు చెందినదిగా గుర్తించారు. వీరిలో సౌరభ్ శర్మ మాజీ కానిస్టేబుల్. గతంలో ఆర్టీవో ఆఫీసు వద్ద విధులు నిర్వర్తించాడు. కాగా, ఆదాయ పన్ను శాఖ అధికారుల రాడార్ లో పలువురు బిల్డర్లతో పాటు సౌరభ్ శర్మ కూడా ఉన్నాడు. భోపాల్ నగరంలోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న శర్మ నివాసంపై ఐటీ అధికారులు గురువారం నాడు దాడులు చేయగా, రూ.1 కోటి నగదు, అరకిలో బంగారం పట్టుబడ్డాయి. అంతేకాదు, విలువైన వజ్రాలు, వెండి కడ్డీలు, ఆస్తి పత్రాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, బంగారం, నగదు తమవే అంటూ ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో, అవి ఎవరికి చెందినవో నిగ్గుతేల్చేందుకు అధికారులు విచారణ ముమ్మరం చేశారు.