తెలంగాణలో 3 విమానాశ్రయాలు ఏర్పాటు చేయండి : సీఎం రేవంత్‌రెడ్డి

దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడితో సమావేశమయ్యారు.

Advertisement
Update:2024-11-26 17:53 IST

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి కట్టబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మమ్నూర్ విమానాశ్రయాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, వరంగల్‌తో పాటు మరో మూడు రామగుండం, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని తెలిపారు.పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందని.. నివేదిక సానుకూలంగా వస్తే తర్వాత భూసేకరణకు వెళ్లొచ్చని రామ్మోహన్‌ నాయుడు చెప్పారు.

ఆదిలాబాద్ విమానాశ్రయం రక్షణ శాఖ పరిధిలో ఉంది. ఆ శాఖ నుంచి అనుమతి ఉంటే అక్కడ కూడా విమానాశ్రయాన్ని చేస్తామన్నారు.‘‘ఆదిలాబాద్‌కు ఓవైపు చత్తీస్‌గఢ్‌, మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. దరిదాపుల్లో విమానాశ్రయం లేదు. అక్కడ ఏర్పాటు చేస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. విమానయాన శాఖ వల్ల కేవలం విమాన ప్రయాణాలే కాదు.. టూరిజం ఉద్యోగ కల్పన మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి పెరుగుతుంది’’ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News