సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగ‌ల్ కాదు.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు

స్వ‌లింగ సంప‌ర్కుల వివాహానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాలంటూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈరోజు తీర్పు వెల్ల‌డించింది.

Advertisement
Update:2023-10-17 14:11 IST

స్వ‌లింగ సంప‌ర్కులు అంటే ఇద్ద‌రు స్త్రీలు లేదా ఇద్దరు పురుషులు, బైసెక్సువ‌ల్స్‌, లింగ‌మార్పిడి చేయించుకున్న‌వారి మ‌ధ్య జ‌రిగే వివాహాల‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. అలాంటి వివాహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌లేమ‌ని తేల్చి చెప్పేసింది. సాధార‌ణ వివాహాల‌తో వాటికి స‌మానంగా హ‌క్కు క‌ల్పించ‌లేమ‌ని పేర్కొంది. అయితే వారు స‌హ‌జీవ‌నం చేయ‌డానికి అభ్యంత‌రం చెప్ప‌బోమ‌ని సుప్రీం కోర్టు ప్ర‌క‌టించింది.

3: 2తో తీర్పు

స్వ‌లింగ సంప‌ర్కుల వివాహానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాలంటూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈరోజు తీర్పు వెల్ల‌డించింది. ఐదుగురు సభ్యులతో కూడిన‌ రాజ్యాంగ ధర్మాసనం 3:2తో మెజార్టీ అభిప్రాయం ప్ర‌కారం సేమ్ సెక్స్ మ్యారేజ్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌లేమ‌ని కోర్టు తీర్పు ఇచ్చింది. లెస్బియ‌న్స్‌, గేస్‌, బైసెక్సువ‌ల్‌, ట్రాన్స్‌జెండ‌ర్స్‌, క్వీర్‌, ఇంట‌ర్‌సెక్సువ‌ల్‌, ఎసెక్సువ‌ల్ వివాహాల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త కుద‌ర‌ని తేల్చిచెప్పేసింది.

స‌హ‌జీవ‌నానికి ఓకే

అయితే ఈ వ‌ర్గాల‌వారు క‌లిసి బ‌త‌కడానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని సుప్రీం కోర్టు పేర్కొంది. వారు స‌హ‌జీవ‌నంలో ఉండ‌టానికి అడ్డుచెప్ప‌బోమ‌ని ప్ర‌క‌టించింది. స్వ‌లింగ సంప‌ర్కుల జంట‌పై ఎలాంటి వివ‌క్షా చూపించ‌కూడ‌ద‌ని, అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News