కుటుంబంతో కలిసి రాష్ట్రపతిని కలిసిన సచిన్ టెండూల్కర్
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కలిశారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును క్రికెెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కలిశారు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ చర్చావేదికలో ప్రత్యేక అతిథిగా హాజరైన సచిన్.. ఈ సందర్భంగా రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. భార్య అంజలి, కుమార్తె సారా టెండూల్కర్‌తో కలిసి రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న సచిన్‌కు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారత ప్రథమ పౌరురాలితో సమావేశమయ్యారు. తాను సంతకం చేసిన టెస్ట్ జెర్సీని ముర్ముకు బహూకరించారు. రాష్ట్రపతి భవన్‌లోని అతిథి గృహాన్ని కుటుంబంతో కలిసి సందర్శించడం తనకు దక్కిన గౌరవమని మాస్టార్ బ్లాస్టర్ టెండూల్కర్ అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించిన అతిథ్యం దీనిని మరింత ప్రభావితం చేసిందని సచిన్ పేర్కొన్నారు. ఈ అనుభవాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రాష్ట్రపతి భవన్‌ను సందర్మించి దాని గొప్పతనం వారసత్వాన్ని తెలుసుకోండి అని టెండూల్కర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రాష్ట్రపతి కార్యాలయం అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.