ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి అంకితా భండారి కేసు..

రాజకీయంగా డ్యామేజీ జరిగే అవకాశం ఉండటంతో సీఎం పుష్కర్ సింగ్ ధామి నష్టనివారణ చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు.

Advertisement
Update:2022-09-28 17:25 IST

ఉత్త‌రాఖండ్‌ లోని రిసార్టులో హ‌త్యకు గురైన 19 ఏళ్ల రిసెప్ష‌నిస్ట్ అంకితా భండారి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచార‌ణ చేపట్టబోతోంది. ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్ప‌గిస్తున్న‌ట్లు ఉత్తరాఖండ్ ముఖ్య‌మంత్రి పుష్క‌ర్‌ సింగ్ ధామి ప్రకటించారు. ఈమేరకు ఆయన బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.

పాతిక లక్షలతో పాపం కడిగేసుకుంటారా..?

ఉత్తరాఖండ్ లో అంకితా భండారి హత్య కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఈనెల 18న ఆమె రిసార్ట్ లో హత్యకు గురయ్యారు. రిసార్ట్ ఓన‌ర్ బీజేపీ నేత కుమారుడు పుల్కిత్ ఆర్య‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. రిసార్ట్ మేనేజ‌ర్ సౌర‌భ్ భాస్క‌ర్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్ అంకిత్ గుప్తాతో క‌లిసి పుల్కిత్ హత్యకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. పుల్కిత్ ఆర్య బీజేపీ సీనియ‌ర్ నేత వినోద్ ఆర్య కుమారుడు కావ‌డంతో, పార్టీ ఆయ‌న్ను సస్పెండ్ చేసింది. రాజకీయంగా డ్యామేజీ జరిగే అవకాశం ఉండటంతో సీఎం పుష్కర్ సింగ్ ధామి నష్టనివారణ చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు.

రేప్ జరగలేదు..!

రిసార్ట్ లో వ్యభిచారం చేయాలంటూ అంకితా భండారిపై ఒత్తిడి తెచ్చారని ఆమె వాట్సప్ చాటింగ్ ద్వారా తెలుస్తోంది. గతంలో కూడా ఓ మహిళా రిసెప్షనిస్ట్ కూడా ఇదే కారణంతో అక్కడ ఉద్యోగం మానేసింది. ఇప్పుడు అంకితా భండారి చెప్పిన మాట వినకపోవడంతో ఆమెను హత్య చేశారు. అయితే హత్యకు ముందు ఆమెపై అత్యాచారం జరిగిన దాఖలాలు లేవని పోస్ట్‌ మార్టం నివేదికలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె వేళ్లు, చేతులు, వీపు భాగంలో గాయం గుర్తులు ఉన్నాయి. దీంతో ఆమెను హింసించి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం బీజేపీకి ఊపిరాడనివ్వడంలేదు. వినోద్ ఆర్యపై సస్పెన్షన్ వేటు వేసినా.. బీజేపీని అందరూ టార్గెట్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News