విజయకాంత్ బతికి ఉంటే రాజకీయంగా క్రియాశీలంగా ఉండేవారు
విజయకాంత్ బతికి ఉండి ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే వారని చెప్పారు. విజయకాంత్ కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
విజయకాంత్ బతికి ఉంటే తమిళ రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండేవారని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ కథానాయకుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య సమస్యలతో గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని అన్నాసాలైలో గల ఐలాండ్ మైదానంలో ఉంచారు.
ఇవాళ మధ్యాహ్నం రజనీకాంత్ విజయకాంత్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయకాంత్ మంచి మనసున్న వ్యక్తి అని.. ఆయన మరణం సినీ, రాజకీయ రంగాలకు తీర్చలేనిదని చెప్పారు. తన ప్రియ స్నేహితుడిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. విజయ్ కాంత్ అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారని అంతా భావించామని తెలిపారు. అయితే ఇటీవల డీఎండీకే మీటింగ్ లో ఆయన్ని చూడగానే ఉన్న కాస్త ఆశ పోయిందని చెప్పారు.
విజయకాంత్ బతికి ఉండి ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే వారని చెప్పారు. విజయకాంత్ కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తమిళనాడులో 2016లో జరిగిన ఎన్నికల నాటికే ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత అవి తీవ్రమవడంతో అప్పటినుంచి ఇంటిపట్టునే ఉంటున్నారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ పలుమార్లు విజయకాంత్ ఆస్పత్రి పాలయ్యారు.