ఆరు గ్యారంటీలకు రాహుల్‌ సమాధానం చెప్పాలే

కేంద్ర మంత్రి బండి సంజయ్‌

Advertisement
Update:2024-11-05 13:25 IST

ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పే దమ్ముందా అని కాంగ్రెస్‌ ముఖ్య నేత రాహుల్‌ గాంధీని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఏం సాధించారని మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ యాడ్స్‌ ఇస్తుందో సమాధానం చెప్పాలన్నారు. తప్పుడు ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ కేసీఆర్‌ ను మించిపోయిందన్నారు. మాజీ సర్పంచుల కోసం బీఆర్‌ఎస్‌ ఆందోళన చేయడం చంపినోడే సంతాప సభ పెట్టినట్టు ఉందన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత అల్లుడి కోసమే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు అని.. రూ.15 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన దానికి రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతామని చెప్తున్నారని ఆరోపించారు. శంషాబాద్‌ లో ఆంజనేయస్వామి ఆలయంపై దాడి అమానుషమని, హిందూ ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా సీఎం ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలన్నారు. హిందువులంతా రోడ్డెక్కే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News