ఆత్మ, పరమాత్మ.. మోదీపై రాహుల్ సెటైర్లు

మోదీని భలేగా ర్యాగింగ్ చేశారని, గంతలో ఎప్పుడూ రాహుల్ లో ఇలాంటి ఫైర్ చూడలేదని అంటున్నారు నెటిజన్లు.

Advertisement
Update: 2024-07-01 15:02 GMT

రాహుల్ ఆన్ ఫైర్ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. పార్లమెంట్ లో రాహుల్ వ్యాఖ్యల్ని చాలామంది సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ ఆయన్ను అభినందిస్తున్నారు. మోదీని భలేగా ర్యాగింగ్ చేశారని, గంతలో ఎప్పుడూ రాహుల్ లో ఇలాంటి ఫైర్ చూడలేదని అంటున్నారు నెటిజన్లు.


అసలు రాహుల్ ఏమ్నారు..?

"ప్రొఫెషనల్‌ పరీక్ష అయిన ‘నీట్‌’ను కమర్షియల్‌గా మార్చారు. రైతు చట్టాల వల్ల 700 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. కనీసం వారి మృతికి సభలో సంతాపం కూడా తెలపలేదు. బీజేపీ హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి. జమ్మూకాశ్మీర్‌ను బీజేపీ రెండు ముక్కలు చేసింది. అల్లర్లతో మణిపూర్‌ అట్టుడికిపోయినా.. ఇప్పటివరకు ప్రధాని అక్కడకు వెళ్లలేదు. నోట్ల రద్దు వల్ల యువత ఉపాధి కోల్పోయింది. జీఎస్టీ వల్ల వ్యాపారులు, ప్రజలు అనేక బాధలు పడ్డారు." అని పార్లమెంట్ లో ప్రసంగించారు రాహుల్ గాంధీ.


మోదీపై ర్యాగింగ్..

నేరుగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. మనమంతా మనుషులం అని, మనకు పుట్టుక, మరణం ఉంటాయని, మనం బయొలాజికల్ అని అన్నారు రాహుల్. మోదీ మాత్రం నాన్ బయొలాజికల్ అని ఎద్దేవా చేశారు. ఆ పరమాత్మ, మోదీ ఆత్మతో నేరుగా మాట్లాడుతుందని కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ విషయం మోదీనే పలు మార్లు చెప్పారని గుర్తు చేశారు రాహుల్.

తన ప్రసంగం మధ్యలో రాహుల్ గాంధీ కొన్ని మతపరమైన ఫొటోలను కూడా పార్లమెంట్ లో ప్రదర్శించడం సంచలనంగా మారింది. దీనిపై బీజేపీ సభ్యులు తీవ్ర విమర్శలు చేయగా, కాంగ్రెస్ కౌంటర్లిచ్చింది. హిందూ సమాజం అంటే కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాదని అన్నారు రాహుల్. అటు ప్రియాంక గాంధీ కూడా రాహుల్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. రాహుల్ అన్నది హిందువుల్ని కాదని, బీజేపీపై ఆయన విమర్శలు చేశారని చెప్పారు ప్రియాంక. 

Tags:    
Advertisement

Similar News