ఎగ్జిట్ పోల్స్ కాదు, ఇవి మోదీ మీడియా పోల్స్

ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు మీడియాని మేనేజ్ చేస్తున్నారని, దాని ఫలితంగానే ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షంగా వచ్చాయని అన్నారు రాహుల్ గాంధీ.

Advertisement
Update: 2024-06-02 23:47 GMT

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జాతీయ మీడియా విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ పై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. సంస్థలతో సంబంధం లేకుండా ఎగ్జిట్ పోల్స్ అన్నీ మోదీ హ్యాట్రిక్ ఖాయమని చెబుతున్నాయి. అదే సమయంలో బీజేపీ ఆశించినట్టుగా 400 సీట్లు రాకపోయినా ఎన్డీఏ కూటమి విజయం మాత్రం గ్యారెంటీ అంటున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. ఇవి మోదీ మీడియా పోల్స్ అని అన్నారాయన.

ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు మీడియాని మేనేజ్ చేస్తున్నారని, దాని ఫలితంగానే ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షంగా వచ్చాయని అన్నారు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా మోదీ వ్యతిరేక గాలి వీస్తోందని, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ని తాము నమ్మే ప్రసక్తే లేదన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ కూటమికి ప్రజాబలం ఉందన్నారాయన.

రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్ నేతలు కూడా ఎగ్జిట్ పోల్స్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు, రెండు కూటములకు దూరంగా ఉన్న విపక్షాల నేతలు కూడా ఎగ్జిట్ పోల్స్ ని తప్పుబడుతూ స్టేట్ మెంట్లిచ్చారు. కొన్ని నెలల క్రితమే ఎగ్జిట్ పోల్స్ రెడీ చేశారని, ఇప్పుడు వాటిని బయటపెట్టారని అంటున్నారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఓ కార్పొరేట్ గేమ్ అని అభివర్ణించారు శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్. పదేళ్లుగా ఎగ్జిట్ పోల్స్ తో సర్వే సంస్థలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారాయన. 

Tags:    
Advertisement

Similar News