రాహుల్‌గాంధీకి పూణె కోర్టు సమన్లు

లండన్‌లో వీర సావర్కర్‌పై రాహుల్‌ నిరాధారమైన ఆరోపణలు చేశాడని సావర్కర్‌ మనవడు సత్యకు సావర్కర్‌ పరువు నష్టం దావా దాఖలు

Advertisement
Update:2024-10-05 12:18 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి పూణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గత ఏడాది లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ మాట్లాడుతూ.. వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లుగా సావర్కర్‌ మనవడు సత్యకు సావర్కర్‌ గతంలో పూణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనికి ప్రాథమిక ఆధారాలున్నట్లు పోలీసులు తేల్చారు. కాగా ఈ కేసు గత నెలలో జ్యుడీషియల్‌మెజిస్ట్రేట్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు అక్టోబర్‌ 23న తమ ముందు హాజరుకావాలని రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. 

ఈ కేసును గత నెలలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జేఎంఎఫ్‌సీ) కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ప్రత్యేక న్యాయస్థానం జాయింట్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) అమోల్ షిండే అధ్యక్షత వహిస్తారు. సత్య సావర్కర్ తరపున న్యాయవాది సంగ్రామ్ కోల్హత్కర్ పీటీఐతో మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ ఆరోపణలకు వ్యతిరేకంగా సమన్లు ​​జారీ చేసినట్లు తెలిపారు. పరువు నష్టంపై భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 500 ప్రకారం ఆయన సమాధానం చెప్పడానికి హాజరుకావాల్సిన అవసరం ఉన్నందన్నారు.

Tags:    
Advertisement

Similar News