అవినీతి, మతోన్మాద విధానాలపై పోరుడుదాం

సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా

Advertisement
Update:2024-12-26 19:15 IST

అవినీతి, అన్యాయం, అప్రజాస్వామిక, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, వామపక్షవాదులు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా పిలుపునిచ్చారు. నగరంలోని మగ్దూంభవన్‌లో గురువారం సీపీఐ శాతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఏడాది పాటు పార్టీ శాతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పై దిగజారి మాట్లాడిన అమిత్‌ షా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు ఐక్య ఉద్యమాలు చేద్దామని పిలుపునిచ్చారు. ఈ రోజు చట్టసభల్లో ప్రజాసమస్యలు చర్చకు రావడం లేదని.. నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితులు వచ్చాయన్నారు. ప్రజాస్వామ్యానికి భారతదేశం అమ్మలాంటిదని.. అలాంటి ప్రజాస్వామ్యదేశంలో విశ్వగురు డిక్టేటర్‌షిప్‌ కొనసాగుతుందన్నారు. సీపీఐ అనేక ఆటుపోట్లను, సమస్యలను ఎదుర్కొని వందో సంవత్సరంలోకి అడుగు పెట్టిందని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లవుతున్నా రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఇప్పటికీ అమలు కావడం లేదన్నారు. దేశంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందన్నారు. సమావేశంలో నాయకులు ప్రభాకర్, ఛాయాదేవి, జ్యోతి, ప్రేమ్, బాలు, కరుణాకర్, శ్రీనివాస్‌ రెడ్డి, మోహన్ రెడ్డి, మధుకర్, కాంతయ్య, నరసింహ, నళిని, చందూనాయక్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News