బోరుబావిలోనే మూడేళ్ల చిన్నారి... రంగంలోకి ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌

బాలికను బైటికి తీయడానికి సుమారు 68 గంటల నుంచి కొనసాగుతున్న సహాయక చర్యలు

Advertisement
Update:2024-12-26 12:50 IST

రాజస్థాన్‌లో ఓ బోరుబావిలో మూడేళ్ల చిన్నారి పడిపోయింది. ఆ బాలికను బైటికి తీయడానికి సుమారు 68 గంటల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కోఠ్‌పుత్లీ జిల్లాలో చేతన అనే చిన్నారి తన తండ్రి పొలంలో ఆడుకుంటూ సోమవారం 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. 150 అడుగుల లోతు వద్ద బాలిక చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. మొదట కుటుంబసభ్యులు ఆ పాపను రక్షించడానికి ప్రయత్నించగా.. మరింత కిందికి జారుకున్నది. ఈ క్రమంలోనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. పైపుతో బోరులోకి ఆక్సిజన్‌ పంపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మంగళవారం క్లిప్‌ల 30 అడుగులు పైకి లాగినట్లు తెలిపారు.

ఇప్పటికే 160 అడుగుల గొయ్యి తవ్వాం. ఇక చిన్నారి ఉన్న బోరుబావికి సమాంతరంగా రంధ్రం చేయాల్సి ఉన్నది. అది పైలింగ్‌ మిషన్‌తో కుదరదు. కాబట్టి మనుషులే తవ్వాల్సి ఉంటుంది. నేడు ఆ చిన్నారిని బైటికి తీస్తామని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ అధికారి యోగేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. ప్రస్తుతం ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌ సాయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.  

Tags:    
Advertisement

Similar News