మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు తీవ్ర అస్వస్థత
ఎయిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో ట్రీట్‌మెంట్
Advertisement
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో మన్మోహన్ సింగ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. మన్మోహన్ సింగ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. మన్మోహన్ సింగ్ వయసు 92 ఏళ్లు. వయోభారంతో పాటు పలు అనారోగ్య సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ 'పీటీఐ' తన కథనంలో వెల్లడించింది.
Advertisement