ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి అస్వస్థత
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కర్ణాటకలోని బెళగావిలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశాలకు దూరమయ్యారు. ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఆమెతో పాటు ఎంపీ ప్రియాంగా గాంధీ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశాలకు "నవ సత్యాగ్రహ బైఠక్" అని పేరు పెట్టారు. ఇవాళ మధ్యాహ్నం బెళగావిలోని మహాత్మాగాంధీ నగర్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ జెండాను ఎగురవేసి ఈ సమావేశాలను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి "జై బాపు, జై భీమ్, జై సంవిధాన్" ర్యాలీ నిర్వహిస్తారు. సీడబ్ల్యూసీ సమావేశాల్లో సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శులు, మాజీ ముఖ్యమంత్రులు వంటి ప్రముఖులు పాల్గొంటారు. మొత్తం మీద 200 మంది కీలక నాయకులు ఈ భేటీలో పాల్గొంటారని ఏఐసీసీ ప్రకటించింది.