ఐఆర్‌సీటీసీ సేవలకు అంతరాయం
నిర్వహణ పనుల కారణంగా.. ఈ-టికెట్ సేవలు అందుబాటులో లేవన్న సంస్థ
Advertisement
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కు చెందిన ఈ-టికెట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఐఆర్‌సీటీసీకి చెందిన వెబ్‌సైట్, యాప్‌లు గురువారం పనిచేయడం లేదు. అయితే నిర్వహణపరమైన పనులు చేపట్టడంతోనే టికెట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొన్నది. నిర్వహణ పనుల కారణంగా.. ఈ-టికెట్ సేవలు అందుబాటులో లేవు. తర్వాత ప్రయత్నించండి. టికెట్ రద్దు చేసుకోవడానికి, ఫైల్ టీడీఆర్ కోసం కస్టమర్ కేర్ నంబర్ 14646, 08044647999, 08035734999కు ఫోన్ లేదా etickets@irctc.co.inకు మెయిల్ చేయండి అని ఐఆర్‌సీటీసీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.
Advertisement