కొత్త పార్టీ ప్రకటించిన ప్రశాంత్ కిషోర్

ప్రశాంత్ కిశోర్ తన రాజకీయ పార్టీ ‘జన్ సురాజ్’ను ఇవాళ గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించారు. బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం వేదికగా జన్‌ సురాజ్‌ పార్టీ పార్టీ ఏర్పాటుపై ఆయన అధికారిక ప్రకటన చేశారు.

Advertisement
Update:2024-10-02 19:50 IST

ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ఇవాళ ప్రారంభించారు. బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జన్‌ సురాజ్‌ పార్టీ’ పేరుతో పార్టీని ప్రకటించారు. బిహారీల గళం ఢిల్లీ దాకా వినిపించేలా చేయడమే జన్ సురాజ్ పార్టీ ప్రధాన లక్ష్యమని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ‘గత 30 ఏళ్లుగా బిహార్‌ ప్రజలు ఆర్జేడీ లేదా జేడీయూ లేదా బీజేపీకి మాత్రమే ఓటు వేస్తున్నారు. రాష్ట్ర యువత సరైన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. ఆ ప్రత్యామ్నాయం కచ్చితంగా సురాజ్‌ పార్టీ’. బిహారీలను ఏకం చేసే వేదికగా మా పార్టీ నిలుస్తుందని పీకే కామెంట్స్ చేశారు.

బిహారీ యువతపై దాడులు జరుగుతున్న బాంబే, ఢిల్లీ, తమిళనాడులకు కూడా మన గళం వినిపించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘లాలూ ప్రసాద్ లాంటి వాళ్లను కాదనుకొని మరో దారి లేక 25-30 ఏళ్లలోపు యూత్ బీజేపీకి ఓటు వేశారని పీకే అన్నారు. జన్‌ సురాజ్‌ పార్టీని ఈసీ గుర్తించినట్లు వెల్లడించారు. బీజేపీతో కలిసి తమ పనిచేస్తుందంటూ కొన్ని విపక్షాలు చేస్తోన్న ఆరోపణలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. బిహార్‌ విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పునకు పిలుపునిచ్చిన పీకే.. విద్యారంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించేందుకు రాబోయే పదేళ్లలో రూ.5లక్షల కోట్లు అవసరమవుతాయని చెప్పారు .దీంతో బిహార్‌లో రానున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధగా ఉన్నామని పీకే తెలిపారు.

Tags:    
Advertisement

Similar News