రామ్మోహన్‌కు విమానయానం, కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు.. కేంద్రమంత్రులకు శాఖలు
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, కింజరపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు అప్పగించింది. ఇక బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మలకు సహాయ మంత్రులుగా శాఖలు కేటాయించింది.
కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలకమైన రక్షణ శాఖ, హోం, ఆర్థిక, రైల్వే, రోడ్లు, రవాణా శాఖల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయా శాఖల్లో పాతవారినే కొనసాగించింది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, కింజరపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు అప్పగించింది. ఇక బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మలకు సహాయ మంత్రులుగా శాఖలు కేటాయించింది.
తెలుగు వారికి కేటాయించిన శాఖలు ఇవే -
- కిషన్ రెడ్డి - బొగ్గు, గనుల శాఖ మంత్రి
- రామ్మోహన్ నాయుడు - పౌర విమానయాన శాఖ
- బండి సంజయ్ - హోం శాఖ సహాయ మంత్రి
- పెమ్మసాని చంద్రశేఖర్ - గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి
- శ్రీనివాస వర్మ - స్టీల్, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి
కీలక శాఖలు - మంత్రులు
ప్రధాని - నరేంద్ర మోదీ
రక్షణ శాఖ - రాజ్ నాథ్ సింగ్
హోం శాఖ - అమిత్ షా
రోడ్లు, భవనాలు - నితిన్ గడ్కరీ
ఆర్థిక శాఖ - నిర్మలా సీతారామన్
వాణిజ్య శాఖ - పీయూష్ గోయల్
హెల్త్ అండ్ ఫ్యామిలీ - జే.పి. నడ్డా
వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి - శివరాజ్ సింగ్ చౌహాన్
రైల్వేస్, సమాచార, ప్రసార శాఖ - అశ్విని వైష్ణవ్
ఉక్కు, భారీ పరిశ్రమలు - కుమారస్వామి
జల్ శక్తి - C.R.పాటిల్
పంచాయతీ రాజ్ శాఖ, ఫిషరీస్, పశు సంరక్షణ - రాజీవ్ రంజన్ సింగ్
ఎడ్యూకేషన్ - ధర్మేంద్ర ప్రదాన్
అర్బన్ అఫైర్స్, పవర్ - మనోహర్ లాల్ ఖట్టర్