ITR ఫైల్ చేస్తున్నారా.. బీకేర్ ఫుల్!
చాలా మంది వ్యక్తులు తమ ITRలను చార్టర్డ్ అకౌంటెంట్ల ద్వారా ఫైల్ చేస్తారని, దాంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను వారితో పంచుకుంటారు. ఐతే లావాదేవీలు పూర్తయిన వెంటనే పాస్‌వర్డ్ రీసెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.
ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తున్నారా..! ఐతే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఐటీ రిటర్న్ దాఖలు చేసే వ్యక్తులే టార్గెట్‌గా సైబర్ నేరగాళ్లు మెయిల్స్, SMS, వాట్సాప్ మెసేజ్‌లు పంపుతున్నారని, వాటి ద్వారా బ్యాంక్ వివరాలు తెలుసుకుని మొత్తం కాజేస్తున్నారని వార్నింగ్ ఇస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు పంపే మెయిల్స్ అథెంటిక్ ఈ-మెయిల్ ఐడీ నుంచి వచ్చిన మెయిల్ తరహాలోనే ఉంటాయంటున్నారు. ఐతే ఇప్పటివరకూ ఇలాంటి కేసులు నమోదు కానప్పటికీ పన్ను చెల్లింపు దారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చాలా మంది వ్యక్తులు తమ ITRలను చార్టర్డ్ అకౌంటెంట్ల ద్వారా ఫైల్ చేస్తారని, దాంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను వారితో పంచుకుంటారు. ఐతే లావాదేవీలు పూర్తయిన వెంటనే పాస్‌వర్డ్ రీసెట్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు.
ఏవైనా అనుమానాలు ఉంటే చార్టర్డ్ అకౌంటెంట్లను లేదా అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలని చెప్తున్నారు. ఎవరితోనూ OTP షేర్ చేసుకోవడం, తెలియని నంబర్ల నుంచి వచ్చే లింక్స్ క్లిక్ చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు. ఇక ఐటీ రిటర్న్స్‌కు సంబంధించి జులై 31తో గడువు ముగియనుంది. అంటే మరో ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటివరకూ దాదాపు 4.5 కోట్ల ITR దాఖలైనట్లు సమాచారం.