మోడీ నామినేషన్.. ఆస్తులు, ఎడ్యూకేషన్‌ వివరాలివే

వివాదాస్పదమైన తన ఎడ్యూకేషన్‌పైనా అఫిడవిట్‌లో క్లారిటీ ఇచ్చారు మోడీ. 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పట్టా అందుకున్నట్లు చెప్పారు.

Advertisement
Update:2024-05-14 21:45 IST

ప్రధాని నరేంద్రమోడీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. తనకు రూ. 3 కోట్లకుపైగా విలువైన ఆస్తులు ఉన్నాయని తన అఫిడవిట్‌లో ప్రకటించారు మోడీ. ఐతే తన పేరిట ఎలాంటి ఇల్లు, కార్లు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

మోడీ తన మొత్తం ఆస్తుల విలువ రూ. 3.02 కోట్లుగా ప్రకటించారు. ఇందులో ఎక్కువ భాగం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 2 కోట్ల 86 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో ఉంది. ఇక తన చేతిలో రూ. 52 వేల 920 ఉన్నట్లు మోడీ స్పష్టం చేశారు. ఇక గాంధీ నగర్‌, వారణాసిలో మరో రెండు బ్యాంకు ఖాతాల్లో రూ. 80 వేల 304 నగదు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ. 9.12 లక్షలు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో పెట్టుబడిగా పెట్టారు. వీటితో పాటు రూ. 2.68 లక్షల విలువైన నాలుగు గోల్డ్‌ రింగ్స్‌ ఉన్నాయని చెప్పారు. 2018-19 లో రూ. 11 లక్షల 14 వేలుగా ఉన్న మోడీ ఆదాయం.. ప్రస్తుతం రూ.23 లక్షల 56 వేలకు పెరిగింది.

ఇక వివాదాస్పదమైన తన ఎడ్యూకేషన్‌పైనా అఫిడవిట్‌లో క్లారిటీ ఇచ్చారు మోడీ. 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ పట్టా అందుకున్నట్లు చెప్పారు. 1983లో గుజరాత్‌ వర్సిటీ నుంచి మాస్టర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ చదివినట్లు చెప్పారు. ఇక తనపై ఎలాంటి పెండింగ్ కేసులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు మోడీ. జూన్ 1న చివరివిడతలో వారణాసి లోక్‌సభ స్థానానికి పోలింగ్ జరగనుంది.

Tags:    
Advertisement

Similar News