'ఉచితాల'పై సుప్రీంలో పిటిషన్‌

కేంద్రానికి, ఈసీకి నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం

Advertisement
Update:2024-10-15 13:37 IST

ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ క్రమంలో కేంద్రంతో పాటు, భారత ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం జారీచేసింది.ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు ఇచ్చే ఉచితాల హామీలను లంచాలుగా పరిగణించాలని కోరుతూ.. బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజకీయపార్టీలు ఎన్నికల ముందు ఉచిత వాగ్దానాలు చేయకుండా నిరోధించడానికి చర్యలు తీసుకునేలా పోల్‌ ప్యానెల్‌ను ఆదేశించాలని అందులో కోరారు. ఈ ఉచితాల కారణంగా ప్రభుత్వ ఖజానాపై అధిక భారం పడుతున్నదని వెల్లడించారు. దీనిపై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. ఇదే అంశంపై పెండింగ్‌లో ఉన్న పలు కేసులతో కలిపి దీన్ని విచారించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి, ఈసీకి నోటీసులు జారీ చేసింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది విజయ్‌ హన్సారియా ఈ అంశంపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. అలాగే ఎన్నికలకు ముందు ఉచిత హామీలు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News