అదానీపై ఆగని నిరసనలు... 6వ రోజూ దద్దరిల్లిన పార్లమెంటు

అదానీ గ్రూప్‌పై పార్లమెంటులో కొనసాగుతున్న నిరసనల మధ్య, ఉభయ సభలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరుతున్నప్పటికీ, ప్రభుత్వం భయపడుతోంది. జెపిసి విచారణ డిమాండ్‌ను లేవనెత్తడానికి కూడా అనుమతించడం లేదు''అని కాంగ్రెస్ మంగళవారం ఆరోపించింది.

Advertisement
Update:2023-02-07 12:02 IST

అదానీ స్కాంపై చర్చకు ఈ రోజు కూడా విపక్షాలు పట్టుబట్టడంతో లోక్‌సభ, రాజ్యసభ రెండూ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడ్డాయి.

అయితే ఈ రోజు నుంచి అదానీ మహామెగాస్కామ్‌లో JPC కోసం డిమాండ్‌ను కొనసాగిస్తూనే పార్లమెంటు కార్యక్రమాల్లో పాల్గొనాలని చాలా ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తెలిపారు.

అయితే అదానీ అంశంపై చర్చ లేకుండా పార్లమెంట్‌లో మిగతా చర్చలకు భారత రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీ లు నో చెప్పాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

''అదానీ గ్రూప్‌పై పార్లమెంటులో కొనసాగుతున్న నిరసనల మధ్య, ఉభయ సభలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరుతున్నప్పటికీ, ప్రభుత్వం భయపడుతోంది. జెపిసి విచారణ డిమాండ్‌ను లేవనెత్తడానికి కూడా అనుమతించడం లేదు''అని కాంగ్రెస్ మంగళవారం ఆరోపించింది. సమస్య పరిష్కారానికి కేంద్రం ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కోట్లాది మంది భారతీయుల కష్టార్జిత పొదుపును అదానీ స్కాం అపాయంలో పడేస్తున్నదని, ఎల్‌ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మార్కెట్ విలువను కోల్పోతున్నాయని ఆరోపిస్తూ ఈ సమస్యపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ రాజ్యసభలోవాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.

రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో 15 విపక్షాల నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, JPC కోసం డిమాండ్‌ను కొనసాగిస్తూనే పార్లమెంటు కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే అందుకు బీఆరెస్, ఆప్ ససేమిరా అన్నట్టు సమాచారం.

"చాలా ప్రతిపక్ష పార్టీలు ఈరోజు నుండి పార్లమెంటరీ కార్యక్రమాలలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాయి. PM లింక్డ్ అదానీ 'మహా మెగా స్కామ్'లో JPC కోసం మా డిమాండ్‌ను లేవనెత్తుతూనే ఉంటాము" అని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ సమావేశం తర్వాత ఒక ట్వీట్‌లో తెలిపారు.

కాంగ్రెస్, డిఎంకె, సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ (యునైటెడ్), ఆప్, సిపిఐ-ఎం, సిపిఐ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, కేరళ కాంగ్రెస్, విడుతలై చిరుతైగల్ కట్చి తదితర పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

Tags:    
Advertisement

Similar News