పది రోజుల్లో కోటి జెండాలు అమ్ముడుపోయాయట‌!

దేశంలో పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా పది రోజుల్లో కోటి జాతీయ జెండాలు అమ్ముడు పోయాయి. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా "హర్ ఘర్ తిరంగ" ప్రచారంలో భాగంగా ఈ జెండాలు అమ్మినట్టు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

Advertisement
Update:2022-08-12 19:07 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా పది రోజుల్లో ఒక కోటి జెండాలు అమ్ముడు పోయినట్టు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

"1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా పోస్టల్ డిపార్ట్ మెంట్ దేశంలోని ప్రతి పౌరుని దగ్గరికి 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమాన్ని తీసుకువెళ్లింది. 10 రోజుల స్వల్ప వ్యవధిలో, 1 కోటి కంటే ఎక్కువ జాతీయ జెండాలు విక్రయించాము. ఈ జెండాలు, పోస్టాఫీసులు, ఆన్‌లైన్‌లో పౌరులు కొనుక్కున్నారు "అని ప్రకటన పేర్కొంది.

''ఈ జెండాలను 25 రూపాయలకే విక్రయించాము. పోస్టల్ ఉద్యోగులు... నగరాలు, పట్టణాలు, గ్రామాలు, సరిహద్దు ప్రాంతాలు, పర్వత, గిరిజన ప్రాంతాలలో "హర్ ఘర్ తిరంగ" సందేశాన్ని ఉత్సాహంగా ప్రచారం చేశారు''అని ప్రకటన తెలిపింది. అందరికి ఈ జెండాలను పోస్టల్ డిపార్ట్ మెంట్ ఉచిత డెలివరీ చేసిందని ఆ ప్రకటన పేర్కొంది.

ఈ జెండాల అమ్మకం ఈ నెల 15 వ తేదీ వరకు కొనసాగుతుందని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరింత మంది ఈ జెండాలు కొని "హర్ ఘర్ తిరంగ" ప్రచారంలో భాగం అవ్వండి అని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ''ఈ జెండాతో పౌరులు సెల్ఫీలు దిగండి, www.harghartiranga.comలో అప్‌లోడ్ చేయండి'' అని ఆ శాఖ పౌరులను కోరింది.

భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 13 నుంచి 15 వరకు నిర్వహించనున్న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా 'హర్ ఘర్ తిరంగ' ప్రచారం జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News