ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి కన్నుమూత
ఝూర్సుగూడ జిల్లా బ్రిజ్ రాజ్ నగర్ లో నబకిశోర్ దాస్ తన కారు నుంచి బయటకు వస్తుండగా అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ గోపాల్ దాస్ ఆయనపై కాల్పులు జరిపాడు.కాల్పులు జరిపిన గోపాలచంద్ర దాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబకిశోర్ దాస్ కన్నుమూశారు. ఏఎస్సై జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఆయన కొద్ది సేపటి క్రితం మరణించారు. ఆయన ఛాతిలో రెండు బుల్లెట్లు దిగడంతో ఆయనను రక్షించలేకపోయామని వైద్యులు చెప్పారు.
ఝూర్సుగూడ జిల్లా బ్రిజ్ రాజ్ నగర్ లో నబకిశోర్ దాస్ తన కారు నుంచి బయటకు వస్తుండగా అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ గోపాల్ దాస్ ఆయనపై కాల్పులు జరిపాడు.కాల్పులు జరిపిన గోపాలచంద్ర దాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
మంత్రి ని ఎయిర్ లిఫ్ట్ ద్వారా భువనేశ్వర్ తరలించారు. మంత్రి ప్రాణాలు కాపాడేందుకు భువనేశ్వర్ లోని అపోలో ఆసుపత్రి వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కాని ఫలితం లేకపోయింది.
మరో వైపు ఏఎస్ఐ గోపాలచంద్ర దాస్ ను పోలీసులు విచారిస్తున్నారు. గోపాలచంద్ర దాస్ మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.