సిద్ధరామయ్యకు నో రిలీఫ్‌

ముడా స్కామ్‌లో సీఎం విచారణకు అనుమతిచ్చిన గవర్నర్‌ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు

Advertisement
Update:2024-09-24 13:21 IST

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్ట్‌ షాక్‌ ఇచ్చింది. భూ కుంభకోణంలో తనను విచాంచడానికి గవర్నర్‌ అనుమతి మంజూరు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్, సీఎం, పిటిషన్ల తరఫున వాదనలు వన్న కోర్టు తీర్పు నేటికి వాయిదా వేసింది. తాజాగా సీఎం పిటిషన్‌ను తోసిపుచ్చింది. ముడా కుంభకోణంలో విచారణను ఎదుర్కోవాలన్న గవర్నర్‌ నిర్ణయాన్నిహైకోర్టు సమర్థించింది. పిటిషన్‌లో పేర్కొన్న వాస్తవాలపై నిస్సందేహంగా విచారణ అవసరమని జస్టిస్ ఎం నాగప్రసన్న అన్నారు. దీంతో సీఎం ముడా కుంభకోణంలో విచారణను ఎదుర్కోనున్నారు.

మైసూర్‌ నగరాభివృద్ది ప్రాధికార( ముడా) కేటాయింపుల్లో సీఎం సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందారనే ఆరోపణలున్నాయి. ఇందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు సామాజిక కార్యకర్త టీజే అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేమమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్‌ సీఎంపై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఆగస్టు 16న ముఖ్యమంత్రిని విచారిచాలంటూ గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్ ఆదేశించారు. ఆ ఆదేశాలను రద్దు చేయాలని కేబినెట్‌ తీర్మానించగా.. దానిని గవర్నర్‌ తోసి పుచ్చారు. దీంతో సీఎం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా గవర్నర్‌ నిర్ణయాన్ని సమర్థించింది. 

సీఎం సిద్ధరామయ్యపై విచారణ చేయడానికి హైకోర్టు అనుమతిచ్చింది. సీఎం భార్య పార్వతమ్మ పేరిట మైసూర్‌ ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు-విజయనగరంలో స్థలం కేటాయించింది. సీఎం సిద్ధరామయ్య మౌఖిక ఆదేశాలతోనే ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్ష బీజేపీ, జేడీఎస్‌ ఆరోపించాయి. ఇవే ఆరోపణలపై ఇవే ఆరోపణలతో ముగ్గురు సామాజిక కార్యకర్తలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈవ్యహారంలో ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలుపాలని గవర్నర్‌ మొదట సీఎంకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. తర్వాత సీఎం విచారణకు అనుమతి మంజూరు చేశారు. గవర్నర్‌ ఆదేశాలపై సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. విచారణ పూర్తయ్యే వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ట్రయల్‌కోర్టును హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తి చేసిన కర్ణాటక హైకోర్టు గవర్నర్‌ చర్యను సమర్థించింది. సీఎంపై విచారణకు అనుమతిచ్చింది.

Tags:    
Advertisement

Similar News