మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న నికితా పోర్వాల్
మిస్ ఇండియా 2024 కిరీటాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిఖిత పోర్వాల్ గెలుచుకుంది.
మిస్ ఇండియా కిరీటాన్ని మధ్యప్రదేశ్ యువతి నిఖిత పోర్వాల్ సత్తా చాటింది. ప్రతిష్టాత్మక 60వ ఎడిషన్ ఫెమినా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు ముంబాయిలో బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఇక అందాల పోటీలలో 2024కు గాను ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని మధ్యప్రదేశ్‌కు చెందిన నిఖిత పోర్వాల్ గెలుచుకుంది. గతేడాది మిస్ ఇండియా టైటిల్ గెలిచిన రాజస్థాన్‌కు చెందిన నందినీ గుప్తా కిరిటాన్ని నిఖిత పోర్వల్‌కు అందించింది. మరోవైపు ఈ పోటిల్లో నిఖిత పోర్వాల్‌కి గట్టిపోటినిచ్చిన రేఖా పాండే మొదటి రన్నరప్‌గా నిలువగా.. ఆయుశీ దోలకియా రెండవ రన్నరప్‌గా నిలిచింది. ఇక మిస్ ఇండియా కిరిటం దక్కించుకున్న నిఖితా మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
బుధవారం రాత్రి అట్ట హాసంగా జరిగిన ఈ వేడుకలకు సినీ ప్రముఖులతో పాటు పలు రంగానికి చెందిన ప్రముఖులు తరలి వచ్చారు. స్టేజీపై ఆట, పాటలతో హొరెత్తించారు. విజేతగా నిలిచిన నిఖిత పోర్వాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఈ ఆనందం మాటల్లో చెప్పలేను. నా పేరెంట్స్ కళ్లలో సంతోషం చూసి గర్వంగా ఉంది. నా జర్నీ ఇప్పుడే మొదలైంది. నేను సాధించాల్సింది ఇంకా చాలా ఉంది" అని ఆమె హర్షం వ్యక్తం చేశారు. నాలైఫ్‌లో నేను చూసిన అతి కొద్దిమంది సంపూర్ణ మహిళల్లో ఐశ్వర్యారాయ్ ఒకరు. అందుకే ఆమెకు నేను ఫ్యాన్ అని పేర్కొంది. అందాల పోటీల విషయంలో ఐష్‌నే తన రోల్‌మోడల్‌గా అని నిఖిత పోర్వాల్ తెలిపింది.