జమిలి ఎన్నికలపై ప్రారంభమైన జేపీసీ తొలి సమావేశం

చట్టం, న్యాయమంత్రిత్వ శాఖ అధికారులు చట్టాలకు సంబంధించిన నిబంధనలను ప్యానల్‌ సభ్యులకు తెలియజేస్తున్నట్లు తెలిపిన అధికారవర్గాలు

Advertisement
Update:2025-01-08 13:26 IST

జమిలి ఎన్నికల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 39 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. తాజాగా ఈ కమిటీ తొలి భేటీ ప్రారంభమైంది. బీజేపీ ఎంపీ, జేపీసీ ఛైర్మన్‌ పీపీ చౌదరి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతున్నది. చట్టం, న్యాయమంత్రిత్వ శాఖ అధికారులు చట్టాలకు సంబంధించిన నిబంధనలను ప్యానల్‌ సభ్యులకు తెలియజేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ భేటీలో కాంగ్రెస్‌ నుంచి ప్రియాంక గాంధీ, శివసేనకు చెందిన శ్రీకాంత్‌ ఏక్‌నాథ్‌ శిండే, ఆప్‌ నుంచి సంజయ్‌ సింగ్‌, టీఎంసీ నుంచి కల్యాణ్‌ బెనర్జీ సహా అన్నిప్రధాన పార్టీల సభ్యులు ఉన్నారు.

దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడానికి తీసుకువచ్చిన 129 వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున సంయుక్త పార్లమెంటరీ కమిటీ కి పంపాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీంతో 39 మంది ఎంపీలతో ఏర్పాటైన జేపీసీ కమిటీ ఈ బిల్లును అధ్యయనం చేయనున్నది. దీనిలో లోక్‌సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది ఉంటారని ప్రభుత్వం నిర్ణయించింది. 

Tags:    
Advertisement

Similar News