ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్డును మారుస్తాం : బీజేపీ నేత బిధూరీ

ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకగాంధీ బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానని బీజేపీ నేత అన్నారు

Advertisement
Update:2025-01-05 16:51 IST

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేశ్ బిధూరీ వివాస్పద వ్యాఖ్యలు ఢిల్లీలోని కల్కాజీ నుంచి తాను విజయం సాధిస్తే స్థానిక రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా రోడ్డును మారుస్తాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బిదూరి సీఎం అతిషిపై బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బిదూరి తాజాగా ప్రియాంకపై మాట తూలారు.ఈ విషయమై మీడియా ఆయనను ప్రశ్నించగా తాను ఆ కామెంట్స్ చేసింది నిజమేనని ఒప్పుకున్నారు.

ఒకప్పుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కూడా హీరోయిన్‌ హేమమాలినిపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, ఆయన చేసింది తప్పయితే తనది కూడా తప్పేనన్నారు. లాలూ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ వైఖరేంటని ప్రశ్నించారు. నిజానికి ప్రియాంకగాంధీ కంటే హేమమాలిని జీవితంలో ఎంతో సాధించారని బిదూరి గుర్తు చేశారు. అయితే లాలూ మటాతప్పారు. కానీ రోడ్లను ప్రియాంకగాంధీ బుగ్గల్లా నున్నగా తయారు చేస్తానన్నారు.ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బిధూరి వ్యాఖ్యలు అతడి మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయని, బీజేపీకి మహిళల పట్ల గౌరవం లేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే మండిపడ్డారు.ప్రియాంకా గాంధీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలకు బీజేపీ అగ్రనాయకత్వం క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News