సీఎం అతిశీని త్వరలోనే అరెస్టు చేస్తారు

ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు

Advertisement
Update:2024-12-25 11:53 IST

దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అతిశీని త్వరలోనే అరెస్టు చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

ఆప్‌ తీసుకొచ్చిన మహిళా సమ్మాన్‌ యోజన, సంజీవని యోజన వంటి పథకాలు కొందరికి నచ్చలేదు. దీంతో ఓ తప్పుడు కేసులో త్వరలో సీఎం అతిశీని అరెస్టు చేస్తారు. అంతకంటే ముందు ఆప్‌ సీనియర్‌ నేతల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తారు అని రాసుకొచ్చారు. దీనిపై బుధవారం 12 గంటలకు విలేకర్ల సమావేశం నిర్వహిస్తానన్నారు.

Tags:    
Advertisement

Similar News