ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోయిస్టుల హతం
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.ఈ ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Advertisement
చత్తీస్‌గడ్‌లోని నారాయణ్‌పుర్- దంతెవాడ సరిహద్దుల్లో ఇవాళ భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో 36 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. నారాయణ్‌పుర్ పోలీసుల చేసిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఏడుగురు మావోయిస్టులను మట్టు పెట్టారు. బస్తర్ రేంజ్‌లోని దంతెవాడ, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది.
దీంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఘటనాస్థలంలో 36 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement