ఫాస్టాగ్‌లపై కీలక అప్డేట్
నిర్దేశించిన గడువు తర్వాత PPBL మినహా మిగతా బ్యాంకులు అందించే ఫాస్టాగ్‌లను తీసుకోవాలని కోరింది. ఆయా బ్యాంకుల్లో నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించి ఫాస్టాగ్‌లను పొందవచ్చు.
ఇన్నాళ్లు ఫాస్టాగ్ చెల్లింపులు పేమెంట్స్ పేటీఎం బ్యాంక్ (PPBL) ద్వారా జరిగేవి. కానీ, సెంట్రల్ బ్యాంక్ పేటీఎంపై ఆంక్షలు విధించడంతో ఫాస్టాగ్ యూజర్లు.. టోల్ చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేసింది. ఈ తరుణంలో PPBLలో ఫాస్టాగ్‌లను ఫిబ్రవరి 29లోపు వినియోగించుకోవాలని NHIA సూచించింది. ఆ తర్వాత నుంచి తాము చెప్పిన బ్యాంకుల్లో మాత్రమే ఫాస్టాగ్‌లను కొనుగోలు చేయాలని తెలిపింది. నిర్దేశించిన గడువు తర్వాత PPBL మినహా మిగతా బ్యాంకులు అందించే ఫాస్టాగ్‌లను తీసుకోవాలని కోరింది. ఆయా బ్యాంకుల్లో నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించి ఫాస్టాగ్‌లను పొందవచ్చు.
వివిధ బ్యాంకులు- ఫాస్టాగ్ చెల్లింపులు
SBI
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్లు, జీప్‌లు, వ్యాన్‌లు, టాటా ఏస్, ఇతర కాంపాక్ట్ లైట్ కమర్షియల్ వాహనాలకు ఫాస్టాగ్ ఫీజులు లేదా సెక్యూరిటీ డిపాజిట్‌లకు ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయదు. కాకపోతే ఫాస్టాగ్ యాక్టివేషన్ కోసం కనీస బ్యాలెన్స్ రూ. 200 ఉండాలి.
యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్ కూడా ఫాస్టాగ్ జారీ చేసినందుకు కస్టమర్ నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయదు. అయితే, తిరిగి రెన్యువల్ చేసే సమయంలో బ్యాంక్ రూ.100 వసూలు చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.200 వసూలు చేస్తుంది.
HDFC
HDFC బ్యాంక్ ట్యాక్స్ కింద రూ.100, సెక్యూరిటీ కింద రూ.100 వసూలు చేస్తుంది. కారు, జీప్, వ్యాన్, టాటా ఏస్ ఇలాంటి మినీ-లైట్ కమర్షియల్ వాహనాలకు విధిస్తుంది.
ICICI
ICICI బ్యాంక్ జాయినింగ్ ఫీజుగా రూ. 99.12 వసూలు చేస్తుంది. సెక్యూరిటీ కింద రూ. 200 తీసుకుంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా ఫాస్టాగ్ వన్ టైమ్ ఫీ కింద రూ.150 వసూల్ చేస్తుంది. రూ. 200 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తుంది.
కెనరా బ్యాంక్
రెన్యువల్ సమయంలో రీ-ఇష్యూషన్ ఫీజు కింద రూ.100 వసూలు చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 200 కట్టించుకుంటుంది.
IDBI
ఐడీబీఐ బ్యాంక్ పన్నులతో సహా రూ. 100 రీ-ఇష్యూషన్ ఫీజును వసూలు చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ రూ. 200 కట్టించుకుంటుంది.
కొటక్ మహీంద్రా
వీసీ4 కోసం రూ. 100 వసూలు చేస్తుంది. ఇతర వెహికల్ క్లాస్‌కు ఫాస్టాగ్ జాయినింగ్ ఫీజుగా, డిపాజిట్‌గా రూ. 200 తీసుకుంటుంది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్
ఇండస్‌ఇండ్ బ్యాంక్ సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ. 200, కస్టమర్ వాలెట్‌లో లోడ్ చేసే థ్రెషోల్డ్ మొత్తంగా రూ. 200 వసూలు చేస్తుంది. బ్యాంక్ వన్ టైమ్ ట్యాగ్ జాయినింగ్ ఫీజుగా రూ. 100 , రీఇష్యూన్స్ ఫీజు కోసం రూ. 100 వసూలు చేస్తుంది.