పార్లమెంట్‌ ముందుకు 16 బిల్లులు

శీతాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్న మోదీ సర్కార్‌

Advertisement
Update:2024-11-24 14:32 IST

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో 16 కీలక బిల్లులు ప్రవేశ పెట్టేందుకు నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నిర్వహణపై ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఏయే బిల్లులు ప్రవేశ పెట్టనున్నామనే సమాచారాన్ని కేంద్రం ఇచ్చింది. సోమవారం నుంచి 18వ లోక్‌సభ మూడో సమావేశాలు, రాజ్యసభ 266వ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో భారీతీయ వాయుయాన్‌ విదేయక్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అమైండ్‌మెంట్‌ బిల్‌, గోవా అసెంబ్లీలో ఎస్టీ నియోజకవర్గాల రీ అడ్జస్ట్‌మెంట్‌ బిల్‌, సముద్రమార్గంలో సరుకు రవాణా, బ్యాంకింగ్‌ లాస్‌, ముసల్‌మాన్‌ వక్ఫ్‌, వక్ఫ్‌ అమైండ్‌మెంట్‌ బిల్స్‌, ఆయిల్‌ ఫీల్డ్స్‌ రెగ్యులేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ అమైండ్‌మెంట్‌ బిల్‌, బాయిలర్స్‌ బిల్‌, రాష్ట్రీయ సర్కారీ విశ్వవిద్యాలయ బిల్‌, మర్చంట్‌ షిప్పింగ్‌ బిల్, కోస్టల్‌ షిప్పింగ్‌ బిల్‌, ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్‌ ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందనుంది. సోమవారం ప్రారంభమయ్యే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెడుతారని ప్రచారం జరుగుతోన్న శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్స్‌ జాబితాలో కనిపించలేదు.


 



Tags:    
Advertisement

Similar News