ముగిసిన మన్మోహన్‌ అంత్యక్రియలు

తుదివీడ్కోలు పలికిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఖర్గే, సోనియా సహా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు

Advertisement
Update:2024-12-28 13:11 IST

భారత మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ చివరి మజిలి ముగిసింది. ఢిల్లీలోని నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ముగిశాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మన్మోహన్‌ పార్థివ దేహానికి అధికారులు అంత్యక్రియలను పూర్తిచేశారు. అంతిమ సంస్కారాలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా హాజరయ్యారు. రాష్ట్రపతి మన్మోహన్‌ పార్థీవ దేహానికి సెల్యూట్‌ చేశారు. త్రివిధ దళాధిపతులు మన్మోహన్‌ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. మన్మోహన్‌కు గౌరవ వందనం చేసిన త్రివిధ దళాల అధికారులు పేటికపై ఉన్న పూలు, జాతీయ జెండాను తొలిగించారు. తర్వాత మత సంప్రదాయాల ప్రకారం మన్మోహన్‌ బంధువులు, మత పెద్దలు అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు.

విదేశీ ప్రతినిధులు సింగ్‌ పార్థీవదేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ప్రధాని అంత్యక్రియల్లో భూటాన్‌ రాజు కేసర్‌ నామ్‌ గేల్‌ వాంగ్‌ చుక్‌ పాల్గొన్నారు. కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా, కిరణ్‌ రిజుజు, కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి సాగిన అంతిమ యాత్రలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. రాహుల్‌ పాల్గొని పాడె మోశారు. తెలంగాణ, కర్ణాటక సీఎంలు రేవంత్‌ రెడ్డి, సిద్ధ రామయ్య, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మన్మోహన్‌కు తుది వీడ్కోలు పలికారు. 

Tags:    
Advertisement

Similar News