మరో సారి మనీష్ సిసోడియా అరెస్ట్...ఈ సారి అరెస్ట్ చేసింది ఈడీ

మద్యం పాలసీని రూపొందించేటప్పుడు మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై రెండు రోజుల పాటు సిసోడియాను విచారించిన తర్వాత ED ఆయనను ఈ రోజు అరెస్టు చేసింది.

Advertisement
Update:2023-03-09 21:00 IST

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ అరెస్ట్ చేయగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను మరో కేంద్ర ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)ఈ రోజు అరెస్టు చేసింది.

మద్యం పాలసీని రూపొందించేటప్పుడు మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై రెండు రోజుల పాటు సిసోడియాను విచారించిన తర్వాత ED ఆయనను అరెస్టు చేసింది.

సిబిఐ కోర్టులో రేపు మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనున్న నేపథ్యంలో ఈడీ ఆయనను అరెస్టు చేయడం చర్చనీయాంశమైంది. ఆయనను ఈడీ రేపు కోర్టులో హాజరుపరచనుంది,

మనీష్ సిసోడియాను ఈడీ అరెస్టు చేయడం పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను జైలు నుండి బైటికి రాకుండా చేయడమే వాళ్ళ లక్ష్యం లాగా కనిపిస్తున్నదని కేజ్రీవాల్ అన్నారు.

"మనీష్‌ను మొదట సిబిఐ అరెస్టు చేసింది. వారికి ఎటువంటి ఆధారాలు దొరక‌లేదు. రేపు బెయిల్ విచారణ తర్వాత‌ మనీష్ విడుదలయ్యేవాడు. కాబట్టి ఈ రోజు ఈడీ అతన్ని అరెస్టు చేసింది. ప్రతిరోజూ ఒక కొత్త ఫేక్ కేసును సృష్టించడం ద్వారా మనీష్‌ను జైల్లో ఉంచడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. ప్రజలే సమాధానం చెబుతారు" అని కేజ్రీవాల్ ఈ సాయంత్రం ట్వీట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News