స్కూల్‌ టాయిలెట్‌లో నాలుగేళ్ల చిన్నారులను..

డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లగా పిల్లలపై లైంగిక దాడికి యత్నించినట్లు తేలింది. దీనిపై పోలీసులను ఆశ్రయించగా ముందు స్పందించలేదు. చివరకు శుక్రవారం రాత్రి కేసు నమోదుచేశారు.

Advertisement
Update: 2024-08-20 11:04 GMT

ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై స్వీపర్ అక్షయ్ షిండే (23) లైంగిక దాడికి యత్నించడం తీవ్ర కలకలం సృష్టించింది. మహారాష్ట్రలోని బద్లాపుర్‌లోని ఓ ప్రీ ప్రైమరీ స్కూల్లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన ఆగస్టు 12న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో థానే నగరం స్తంభించింది. ఆందోళనకారులు రైల్వేట్రాక్‌లపైకి రావడంతో స్థానిక రైళ్లను నిలిపేశారు. స్వీపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది.

నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు టాయిలెట్‌లో ఉన్న సమయంలో దాన్ని శుభ్రం చేసే సాకుతో స్వీపర్‌ వారి వద్దకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఘటన జరిగిన తర్వాత బాలిక నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటపడింది. డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లగా పిల్లలపై లైంగిక దాడికి యత్నించినట్లు తేలింది. దీనిపై పోలీసులను ఆశ్రయించగా ముందు స్పందించలేదు. చివరకు శుక్రవారం రాత్రి కేసు నమోదుచేశారు. విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసు విచారణలో స్కూల్‌లోని లొసుగులు బయటపడ్డాయి. యాజమాన్యం బాలికల కోసం కనీసం లేడీస్ స్టాఫ్‌ని నియమించలేదు. దీంతో నిందితుడికి అవకాశం దొరికింది.

ఈ పరిణామాలపై బాలల హక్కుల జాతీయ కమిషన్ స్పందించింది. దర్యాప్తు నిమిత్తం బద్లాపుర్‌కు ఒక బృందాన్ని పంపనుంది. ఘటనపై పాఠశాల యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది. ప్రిన్సిపల్‌ను సస్పెండ్‌ చేసింది. క్లాస్‌ టీచర్‌, వారి బాధ్యతలు చూస్తున్న ఇద్దరు సిబ్బందిని తొలగించింది. కోల్‌కతా డాక్టర్ కేసు మొదలు వరుస అత్యాచార ఘటనలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News