మహారాష్ట్రలో మహాయుతి, ఝార్ఖండ్ లో జేఎంఎం హవా
రెండు రాష్ట్రాల్లో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు భిన్నంగా ఫలితాలు
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా వెలువడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని మెజారిటీ సర్వే సంస్థలు చెప్పాయి. మహారాష్ట్రలో మహాయుతి, మహా వికాక్ అఘాడీల మధ్య హోరా హోరీ పోటీ ఉంటుందని చెప్పాయి. కానీ ఇవాళ ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాల ప్రకారం మహాయుతి కూటమి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ) ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ (145) దాటింది. మొత్తం 288/ 220 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నది. మహా వికాస్ అఘాడీ 54 చోట్లనే ఆధిక్యంలో ఉన్నది. మహాయుతిలో బీజేపీ 125, శివసేన (ఏక్‌నాథ్), 58, ఎన్సీపీ (అజిత్ ) 36 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. మహా వికాస్ అఘాడీలో శివసేన (యూబీటీ ) 18, ఎన్సీపీ (ఎస్పీ ) 11, కాంగ్రెస్ 19 చోట్ల లీడ్‌లో ఉన్నాయి. దీంతో ఇదే ట్రెండ్స్ ఇలాగే కొనసాగితే మహారాష్ట్రలో మహాయుతి కూటిమి భారీ మెజారిటీతో గెలువబోతున్నది.
ఝార్ఖండ్‌లో మాత్రం ఇండియా కూటమి మరోసారి అధికారంలోకి రాబోతున్నది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం జేఎంఎం కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. 81 సీట్లలో ఇండియా కూటమి 50 చోట్ల, ఎన్డీఏ 29 చోట్ల లీడ్‌లో ఉన్నాయి.