మహాత్మా గాంధీ మనవరాలు కన్నుమూత
ముంబయిలోని గాంధీ స్మారక్ నిధికి గతంలో ఉషా గోకనీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. గాంధీ స్థాపించిన వార్ధా సేవాగ్రామ్ ఆశ్రమంలో గోకనీ బాల్యం గడిచింది.
మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ కన్నుమూశారు. మంగళవారం ముంబయిలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 89 సంవత్సరాలు. గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రెండు సంవత్సరాలుగా మంచానికే పరిమితమయ్యారు.
ముంబయిలోని గాంధీ స్మారక్ నిధికి గతంలో ఆమె చైర్‌పర్సన్‌గా పనిచేశారు. గాంధీ స్థాపించిన వార్ధా సేవాగ్రామ్ ఆశ్రమంలో గోకనీ బాల్యం గడిచింది.
మహాత్మా గాంధీ 1917 నుంచి 1934 వరకు మణి భవన్‌లో ఉన్నారు. 1955 అక్టోబర్ 2న మణి భవన్‌ను గాంధీ మెమోరియల్ సొసైటీకి అప్పగించడంతో స్మారక్ నిధి లాంఛనంగా పని చేయడం ప్రారంభించింది. దానికి గోకనీ మాజీ చైర్‌పర్సన్.
మణిభవన్ దేశ స్వాతంత్య్ర పోరాటంలో చేపట్టిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, శక్తివంతమైన ఉద్యమాలకు సాక్ష్యంగా ఉంది. గాంధీ స్మారక్ నిధి ముంబయి, మణి భవన్ గాంధీ సంగ్రహాలయ అనే రెండు సంస్థలు మణి భవన్‌లో ఉన్నాయి.