రేపు కేఆర్‌ఎంబీ కీలక సమావేశం

వాటర్‌ షేరింగ్‌, జ్యూరిస్‌డిక్షన్‌ సహా పలు అంశాలపై చర్చ

Advertisement
Update:2025-01-20 20:53 IST

కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ) కీలక సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు జలసౌధలో నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు కృష్ణా జలాల్లో కేటాయించిన 811 టీఎంసీల్లో ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు తీసుకునేలా 2015లో టెంపరరీ వర్కింగ్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులు తేల్చేవరకు కృష్ణా జలాల్లో 50 శాతం వాటా ఇవ్వాలని తెలంగాణ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న సమావేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 50 శాతం వాటా కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో ఈ సమావేశంలో తేలనుంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ తో పాటు వాటి ఔట్‌ లెట్ల నిర్వహణను బోర్డుకే అప్పగించాలని జారీ చేసిన జ్యూరిస్‌డిక్షన్‌ పైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రెండీ దశ టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. తాగునీటి అవసరాల కోసం తీసుకున్న నీటిలో 20 శాతమే వినియోగం కింద లెక్కించాలని, నాగార్జున సాగర్‌ లో ఒక వాటర్‌ ఇయర్‌ లో నిల్వ చేసుకున్న నీటిని మరుసటి వాటర్‌ ఇయర్‌ కు క్యారీ ఓవర్‌ చేయాలని, నాగార్జు సాగర్‌ ప్రాజెక్టుతో కుడి, ఎడమ కాల్వల నిర్వహణను తెలంగాణకు అప్పగించాలని, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీలు, సుంకేసులపై టెలీమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, ఆర్డీఎస్‌ మోడ్రనేజేషన్‌, శ్రీశైలం ప్లంజ్‌ పూల్‌కు అత్యవసర మరమ్మతులు సహా ఇతర తెలంగాణ ప్రతిపాదనలపైనా సమావేశంలో చర్చిస్తారు. కేఆర్‌ఎంబీ చైర్మన్‌ అతుల్‌ జైన్‌ అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్‌ సెక్రటరీలు, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లు పాల్గొని ఎజెండాలోని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    
Advertisement

Similar News