కోల్‌కతా హత్యాచార ఘటన.. దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరాహార దీక్షలు

ఈ ఘటనలో బెంగాల్‌ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన జూనియర్‌ డాక్టర్లు

Advertisement
Update:2024-10-09 13:23 IST

బెంగాల్‌ ఆర్జీకార్‌ కాలేజీలో హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తు సరిగా లేదని సుప్రీంకోర్టు ఈ కేసును సూమోటోగా తీసుకుని సీబీఐ ఎంక్వైర్వీకి ఆదేశించింది. అయితే ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని జూనియర్‌ డాక్టర్లు మొదటి నుంచి తప్పుపడుతున్నారు. దీంతో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని సేవలను బహిష్కరించారు. ఇటీవల సీఎం మమతా బెనర్జీ వాళ్లతో చర్చించి బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం హామీ మేరకు ఆందోళన చేస్తున్న వైద్యులు తిరిగి విధుల్లో చేరారు. తాజాగా ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. జూనియర్‌ డాక్టర్లు నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. వారికి మద్దతుగా వైద్యులు దేశవ్యాప్తంగా నిరాహారదీక్ష చేపడుతున్నారు.

ఢిల్లీలోని మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీ, గురుతేజ్‌ బహదూర్‌ హాస్పిటల్‌ కు చెందిన వైద్యులు నల్లరిబ్బన్లు ధరించి ఒక్కరోజు నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని ఎయిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ క్యాండిల్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. బెంగాల్‌ జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న నిరాహారదీక్షకు వ్యతిరేకంగా మా మద్దతు తెలియజేస్తూ బుధవారం నిరాహార దీక్ష చేస్తున్నామని ఎంఏఎంసీ కాలేజీ ఆర్టీఏ ప్రెసిడెంట్‌ అపర్ణ సెటియా తెలిపారు. దేశంలో జరిగే ఇలాంటి క్రూర చర్యలను చూస్తూ మౌనంగా ఉండమని జీటీబీ వైద్యుల సంఘం పేర్కొన్నది. పనిచేసే చోట డాక్టర్లకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా మెడికల్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఏఐఎంఏ) కూడా నిరాహారదీక్ష పాల్గొంది. జూనియర్‌ డాక్టర్లు ఇన్నిరోజులుగా న్యాయం కోసం పోరాడుతున్నా.. బెంగాల్ ప్రభుత్వం నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్షం చేస్తున్నది. జూనియర్‌ డాక్టర్లకు సంఘీభావంగా డాక్టర్ల భద్రత, గౌరవం కోసం ముందుండి పోరాడాడుతామని వెల్లడించింది.

Tags:    
Advertisement

Similar News