కన్నబిడ్డ పైనే ఘాతుకం.. తండ్రికి 101 ఏళ్ల జైలుశిక్ష

బాలిక తల్లి నిద్రిస్తున్నప్పుడో.. ఆమె ఇంటి వద్ద లేనప్పుడో ఈ ఘాతుకాలకు ఒడిగట్టునట్టు తేలింది. బాధితురాలి తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా అతడికి వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారు.

Advertisement
Update:2024-07-02 19:37 IST

కామంతో కళ్లు మూసుకుపోయి కుమార్తెపై ఆరేళ్లపాటు లైంగిక దాడికి పాల్పడి.. ఆమె గర్భం దాల్చడానికి కారణమైన తండ్రికి కేరళలోని న్యాయస్థానం 101 ఏళ్ల జైలు శిక్షతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కుమార్తె పదేళ్ల ప్రాయంలో ఉన్నప్పటి నుంచే అతను ఈ దారుణానికి పాల్పడగా.. 16 ఏళ్ల వయసులో ఆమె గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక ఈ విషయాన్ని తన వాంగ్మూలంలో వెల్లడించడంతో ఆమె 3 నెలల గర్భాన్ని వైద్యులు తొలగించారు. డీఎన్‌ఏ పరీక్షలో ఆమె గర్భానికి కారకుడు తండ్రేనని తేలింది. బాలిక తల్లి నిద్రిస్తున్నప్పుడో.. ఆమె ఇంటి వద్ద లేనప్పుడో ఈ ఘాతుకాలకు ఒడిగట్టునట్టు తేలింది. బాధితురాలి తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా అతడికి వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారు.

పోక్సో, జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ వంటి చట్టాల కింద గతవారం ఆ వ్యక్తికి కేరళలోని మల్లపురానికి చెందిన స్పెషల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ క్రూరమైన నేర ప్రభావం ఆ బాలికపై జీవితాంతం ఉంటుందని ఈ సందర్భంగా న్యాయస్థానం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. దీనిని సాధారణ లైంగిక నేరంగా చూడలేమని, నేరానికి పాల్పడిన వ్యక్తి ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. అతడిపై ఎలాంటి కనికరం చూపలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News