ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని పరిశీలించిన కేసీఆర్
టీఆరెస్ అధినేత కేసీఆర్ కొద్ది సేపటి క్రితం ఢిల్లీకి చేరుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల కోసం ఉత్తరప్రదేశ్ కు వెళ్ళిన ఆయన అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో నూతనంగా నిర్మాణం అవుతున్న టీఆరెస్ కార్యాలయ పనులను ఆయన పరిశీలించారు, ఈ మధ్యనే అద్దెకు తీసుకున్న నూతన బీఆరెస్ కార్యాలయాన్ని సందర్శించారు.
తెలంగాణ సీఎం, టీఆరెస్ అధినేత కేసీఆర్, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మంగళవారం మధ్యాహ్నం ఉత్తర ప్రదేశ్ వెళ్ళారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. అనంతరం కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఇటీవల ఏర్పాటు చేసిన బారత్ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని సందర్శించారు.
ఢిల్లీలో నిర్మాణం కొనసాగుతున్న టీఆరెస్ నూతన కార్యాలయ పనులు పరిశీలించారు. నూతన కార్యాలయ నిర్మాణం పూర్తయ్యేదాకాఢిల్లీలో కార్యకలాపాలకోసం ఈ మధ్యనే సర్దార్ పటేల్ మార్గ్ లో ఓ బిల్డింగ్ ను అద్దెకు తీసుకున్నారు. హైదరాబాద్ లో కేసీఆర్ బీఆరెస్ పార్టీ ప్రకటించిన రోజే ఆ బిల్డింగుకు రంగులు వేసి ముస్తాబు చేశారు. ఈ కార్యాలయాన్నే కేసీఆర్ ఈ రోజు పరిశీలించారు.
ఈ పర్యటనలో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయంలో ఆయన పలు పార్టీలకు చెందిన నేతలతో పాటు పలువురు మేదావులతో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి రావడం ఇదే తొలిసారి.