మోదీ, ఆయన ముందు కుక్కపిల్లలు.. కర్నాటకలో పొలిటికల్ హీట్

డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు, రాష్ట్రాలకు రావాల్సిన హక్కుల్ని కూడా సాధించుకోలేరని రుజువైంది. బీజేపీ ముఖ్యమంత్రులు మోదీ ముందు కుక్కపిల్లలంటూ సిద్ధరామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Update:2023-01-04 18:48 IST

బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర నేతలు.. మోదీ ముందు కుక్క పిల్లల్లా ఉంటారని, ఆయన్ని చూస్తే వణికిపోతారని, ఆయన ముందు మాట్లాడే ధైర్యం కూడా వారికి లేదని అన్నారు కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు కర్నాటకలో పొలిటికల్ హీట్ పెంచాయి. తమని కుక్కపిల్లలతో పోలుస్తారా అంటూ బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. మన్మోహన్ హయాంలో రాష్ట్రానికి మీరేం తెచ్చారంటూ కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఎందుకీ పోలిక..?

15వ ఆర్థిక సంఘం కర్నాటకకు స్పెషల్ అలవెన్స్ రూపంలో రూ. 5,495 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. కానీ కేంద్ర ఆర్థిక శాఖ ఆ నిధులు ఇవ్వలేదు, సరికదా ఆర్థిక మంత్రి సీతారామన్ కనీసం ఆ నిధుల విషయంలో స్పందించ లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు, రాష్ట్రాలకు రావాల్సిన హక్కుల్ని కూడా సాధించుకోలేరని ఈ వ్యవహారంతో రుజువైంది. దీంతో కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. బీజేపీ ముఖ్యమంత్రులు మోదీ ముందు కుక్కపిల్లలంటూ సిద్ధరామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అవును మేం కుక్కపిల్లలమే..

కుక్కపిల్లలతో పోల్చడాన్ని సీఎం బొమ్మై తప్పుబట్టారు. ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తున్నాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన సమాధానం చెబుతారని శాపనార్థాలు పెట్టారు. కుక్క విశ్వాసానికి ప్రతీక అని.. పనిని నమ్మకంగా చేస్తుందని, తాను కూడా ప్రజల కోసం విశ్వాసంగా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు బొమ్మై. కాంగ్రెస్ నేతలు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ముందు నిలబడలేకపోయారని, కర్నాటకకు ఒక్క పైసా తీసుకురాలేదని బొమ్మై విమర్శించారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత కర్నాటకకు 6వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను ఇచ్చారని వివరించారు. ఎగువ కృష్ణా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి గ్రాంట్లు విడుదల చేస్తామని అన్నారు. కర్నాటకలోని ప్రాజెక్టులకు ప్రధాని మోదీ కామధేనువు లాంటి వారని ఆకాశానికెత్తేశారు.

Tags:    
Advertisement

Similar News