జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఇంటర్వ్యూ.. ఏడుగురు పోలీసులపై వేటు

ఇంటర్వ్యూకు సహకరించారని ఇద్దరు డీఎస్సీలు సహా ఏడుగురిపై పంజాబ్‌ హోం శాఖ చర్యలు

Advertisement
Update:2024-10-26 11:08 IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు, మహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యతో ఆ రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. ఎన్నికల సమయం కావడంతో రాజకీయ నేతలూ ఆందోళనకు గురయ్యారు. సిద్ధిఖీ హత్యకు కారణం లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగే కారణమని తేలింది. ఈ నేపథ్యంలోనే లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నది. అయితే అతనికి సంబంధించిన వ్యవహారంలో ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు నిర్లక్ష్యంగా వ్యవహరించి సస్పెండ్‌ అయ్యారు. అతను కస్టడీలో ఉన్న సమయంలో టీవీ ఇంటర్వ్యూలకు అనుమతి ఇచ్చినందుకు అక్కడి అధికారులపై పంజాబ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2023లో పంజాబ్‌ జైలులో శిక్ష అనుభిస్తున్న సమయంలో అదే ఏడాది మార్చిలో ఒక టీవీ ఛానల్‌లో లారెన్స్‌కు సంబంధించి రెండు ఇంటర్వ్యూలు ప్రసారమయ్యాయి.

తూర్పు బాంద్రాలోని తన కుమారుడు, ఎమ్మెల్యే జీషన్‌ సిద్ధిఖీ కార్యాలయం సమీపంలో బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. అక్టోబర్‌ 12న జరిగిన ఈ సంఘటనకు తామే కారణమని లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంక్‌ ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటివరకు 14 మంది అరెస్టు చేయగా.. ముగ్గురు పరారీలో ఉన్నారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం హర్యానాకు చెందిన గుర్‌మైల్‌ బల్జీత్‌, యూపీకి చెందిన ధర్మరాజ్‌ కశ్యప్‌, శివ్‌కుమార్‌ గౌతమ్‌ అనే ముగ్గురు నిందితులు సిద్ధిఖీని కాల్చి చంపారు. శివ్‌ఖుమార్‌కు తుపాకుల వినియోగం తెలుసు. అతను గతంలో యూపీలో జరిగిన వేడుకల్లో గాల్లోకి కాల్పులు చేసిన సందర్భాలున్నాయి. అతనే ఈ కేసులో ప్రధాన షూటర్‌గా భావిస్తున్నారు. కశ్యప్‌,గుర్‌మైల్‌ బల్జీత్‌లకు అతనే ట్రైనింగ్‌ ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News