భారతీయ మహిళా శాస్త్రవేత్తకు నార్మన్ బోర్లాగ్ అవార్డ్

స్వాతి నాయక్ న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్‌ఆర్‌ఐ)లో విత్తన వ్యవస్థ, ఉత్పత్తి నిర్వహణకు దక్షిణాసియా లీడ్‌గా పనిచేస్తున్నారు. వరిపంట సాగు చేస్తున్న చిన్న రైతులకు అందించిన సేవలకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది.

Advertisement
Update:2023-09-22 10:25 IST

భారతీయ మహిళా శాస్త్రవేత్తను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇంటర్నేషనల్‌ రైస్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఆర్‌ఆర్‌ఐ) సైంటిస్ట్‌ డాక్టర్‌ స్వాతి నాయక్ నార్మన్‌ ఈ బోర్లాగ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. క్షేత్రస్థాయి పరిశోధనలో ఆమె కృషికి గుర్తింపుగా 2023వ సంవత్సరానికి ఆమెకు ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్లు వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌ తన అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్) అకౌంట్ ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా ఆమెను “అత్యుత్తమ యువ శాస్త్రవేత్తగా” పేర్కొంటూ ఈ అవార్డును అందించనుంది ఈ సంస్థ. స్వాతి నాయక్ న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్‌ఆర్‌ఐ)లో విత్తన వ్యవస్థ, ఉత్పత్తి నిర్వహణకు దక్షిణాసియా లీడ్‌గా పనిచేస్తున్నారు. వరిపంట సాగు చేస్తున్న చిన్న రైతులకు అందించిన సేవలకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది.

నోబెల్ అవార్డు గ్రహీత, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ నార్మన్ బోర్లాగ్ జ్ఞాపకార్థం 40 ఏళ్లలోపు వయసు ఉన్న అసాధారణ శాస్త్రవేత్తలకు, ఆహారం, పోషకాహార భద్రత, ఆకలి నిర్మూలన రంగంలో పనిచేస్తున్న వారికి ఈ అవార్డు ఇవ్వబడుతుంది.




ఈ విషయమై స్పందించిన స్వాతి ఫీల్డ్ సైంటిస్ట్‌గా తన ప్రయత్నాలను, పనిని ఈ అవార్డు మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఆమె 500 కంటే ఎక్కువ వరి రకాల కోసం 10,000 కంటే ఎక్కువ విస్తృతమైన ఆన్-ఫార్మ్ పరీక్షలను నిర్వహించారు. ఆసియా మరియు ఆఫ్రికా అంతటా వివిధ దేశాల్లోని విభిన్న పర్యావరణ వ్యవస్థల్లో ఈ ట్రయల్స్‌ని అమలు చేయడం కోసం వేలాది మంది చిన్న రైతులతో కలిసి పనిచేశారు.

స్వాతి ఈ అవార్డు సాధించిన మూడవ భారతీయ వ్యక్తిగా, మొదటి ఒడిశా ప్రతినిధిగా రికార్డుకెక్కారు. అమెరికాలోని డెస్ మోయినెస్‌లో అక్టోబర్ 24, 26 తేదీల్లో 2023 నార్మన్ ఇ బోర్లాగ్ అంతర్జాతీయ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును స్వాతినాయక్ అందుకుంటారు.

*

Tags:    
Advertisement

Similar News