మెడికల్ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. ఇకపై విదేశాల్లో ప్రాక్టీస్!

భారత జాతీయ వైద్యమండలికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో భారత్‌లో మెడిసిన్ చదివిన అభ్యర్థులు యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో పీజీ కోర్సుల్లో చేరడమే కాకుండా మెడిసిన్ ప్రాక్టీస్‌ కూడా చేసుకోవచ్చు.

Advertisement
Update:2023-09-22 15:48 IST

సాధారణంగా మనదేశంలో మెడిసిన్ పూర్తి చేసినవాళ్లకు కేవలం ఇక్కడ మాత్రమే వైద్యం చేసే వీలుంటుంది. అయితే ఇకపై ఇండియన్ డాక్టర్లు విదేశాల్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చని ‘వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌’ ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే..

భారత జాతీయ వైద్యమండలికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో భారత్‌లో మెడిసిన్ చదివిన అభ్యర్థులు యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో పీజీ కోర్సుల్లో చేరడమే కాకుండా మెడిసిన్ ప్రాక్టీస్‌ కూడా చేసుకోవచ్చు. 2024 నుంచి భారతీయ విద్యార్థులు విదేశాల్లో వైద్య విద్య, ప్రాక్టీస్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా ఉన్న 706 మెడికల్ కాలేజీలకు ఈ గుర్తింపు వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ అక్రెడిషన్ వల్ల విదేశాల్లోని మెడికల్ విద్యా సంస్థలు, భారత్‌లోని కాలేజీల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని, మెడిసిన్‌లో సరికొత్త ఆవిష్కరణలకు ఇది సహకరిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఇకపై భారతీయ వైద్య విద్యార్థులు ప్రపంచంలో పలు చోట్ల తమ వైద్య వృత్తిని కొనసాగించొచ్చు. అలాగే అంతర్జాతీయ విద్యార్థులు ఇక్కడి మెడికల్ కాలేజీల్లో చేరి మెడిసిన్ అభ్యసించేందుకు ఈ అక్రెడిషన్ ఉపయోగపడుతుంది.

వైద్య విద్యకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలను ‘వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ)’ పర్యవేక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వైద్య విద్యలో ఆధునిక, సాంకేతిక ప్రమాణాలను మెరుగుపరచడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. ఈ అక్రెడేషన్ కోసం ప్రపంచంలోని ఎన్నో దేశాలు అప్లై చేస్తుంటాయి. ఆయా దేశాల్లోని ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్‌ను బట్టి గుర్తింపు లభిస్తుంటుంది. ‘డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ’ గుర్తింపు కోసం ప్రతీ వైద్య కళాశాల నుంచి 60 వేల డాలర్లను రుసుముగా వసూలు చేస్తుంది.


Tags:    
Advertisement

Similar News