భారత చ‌రిత్ర‌ను వక్రీకరించారు, మనం తిరగరాద్దాం : అమిత్ షా

"నేను చరిత్ర విద్యార్థిని. మన చరిత్రను సరిగ్గా చూపెట్ట‌లేద‌ని, వక్రీకరించారని నేను చాలాసార్లు వింటున్నాను. బహుశా అది నిజ‌మే కావచ్చు, కానీ ఇప్పుడు మనం దీన్ని సరిదిద్దాలి. చరిత్రను సక్రమంగా, అద్భుతమైన రీతిలో ప్రదర్శించకుండా మన‌ల్ని ఎవరు ఆపుతార‌ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను" అని అమిత్ షా అన్నారు.

Advertisement
Update:2022-11-25 14:37 IST

భారతదేశ చరిత్రను తిరగరాయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చరిత్రకారులను కోరారు. ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం చరిత్ర గమనాన్ని పునఃసమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. చ‌రిత్ర‌కారుల ప్రయత్నాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని వారికి హామీ ఇచ్చారు.

17వ శతాబ్దపు అహోమ్ జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ జయంతి సంద‌ర్భంగా అస్సాం ప్రభుత్వం ఢిల్లీలో నిర్వ‌హిం చిన కార్యక్రమంలో ఆయ‌న‌ పాల్గొన్నారు. అహోమ్ జనరల్ లచిత్ బర్ఫుకాన్ జ్ఞాపకార్థం నవంబర్ 24వ తేదీని లచిత్ దివస్‌గా పాటిస్తారు. మొఘల్ విస్తరణను అడ్డుకోవడంలో లచిత్ పోషించిన పాత్రను కొనియాడుతూ సరిఘాట్ యుద్ధంలో అనారోగ్యంతో ఉన్నప్పటికీ వారిని ఓడించినట్లు అమిత్ షా చెప్పారు.

"నేను చరిత్ర విద్యార్థిని. మన చరిత్రను సరిగ్గా చూపెట్ట‌లేద‌ని, వక్రీకరించారని నేను చాలాసార్లు వింటున్నాను. బహుశా అది నిజ‌మే కావచ్చు, కానీ ఇప్పుడు మనం దీన్ని సరిదిద్దాలి. చరిత్రను సక్రమంగా, అద్భుతమైన రీతిలో ప్రదర్శించకుండా మన‌ల్ని ఎవరు ఆపుతార‌ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను" అని అమిత్ షా అన్నారు. 

"దేశంలో 150 ఏళ్లుగా పరిపాలించిన 30 రాజవంశాలు, స్వాతంత్య్రం కోసం పోరాడిన 300 మంది ప్రముఖులపై పరిశోధన చేసేందుకు ప్రయత్నించాలని ఇక్కడ ఉన్న విద్యార్థులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లందరినీ కోరుతున్నాను'' అని షా అన్నారు. ఒక్కసారి రాస్తే చాలు, తప్పుడు కథనాలు ప్రచారం అవుతున్నాయనే ఆలోచన ఇక పై ఉండదు, అన్నారాయన. విజ్ఞాన్ భవన్‌లో ఉన్న చరిత్రకారులు, విద్యార్థులకు కేంద్రం వారి పరిశోధనలకు మద్దతు ఇస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. " మీరంతా ఇందుకోసం ముందుకు రండి, పరిశోధించండి. చరిత్రను తిరగరాయండి. ఈ విధంగా మనం భవిష్యత్ తరానికి కూడా స్ఫూర్తిని ఇవ్వగలిగిన‌వార‌మ‌వుతాం." అన్నారాయన.

Tags:    
Advertisement

Similar News